![]() |
![]() |

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి అందరికీ తెలుసు. ఎన్నో వందల సినిమాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న ఒక గొప్ప నటి. ఆమె బుల్లితెర మీద వచ్చే ఎన్నో షోస్ కి కూడా వస్తూ ఉంటారు. అలాగే ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి రాబోతున్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "మేమంతా కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమొరీని ఇద్దామని అది కూడా ఇంద్రజ గారి చేతుల మీద ఇప్పిద్దాం అనుకుంటున్నాం" అని చెప్పాడు ఆది. ఇక ఇంద్రజ ఒక గిఫ్ట్ ప్యాక్ తెచ్చారు. అది ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది పోగొట్టుకున్న తన కూతురి ఫోటో అది. ఆ ఫోటో చూసాక ఇక కన్నీళ్లు ఆగలేదు అన్నపూర్ణమ్మకు. ఆమె ఏడవడం చూసిన ప్రేరణ కూడా కన్నీళ్లు పెట్టేసుకుంది. "ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారు జామున లేచినప్పుడు గుర్తొస్తుంది.
ఈ మధ్య మీరంతా అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు కదా అందుకని" అంటూ ఏడుస్తూనే వెళ్లి కూర్చుంది. ఇక ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఇంద్రజ ఆమె మోకాలి మీద తలపెట్టుకుని పడుకుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఒక శ్యాడ్ సాంగ్ ప్లే అవుతూనే ఉంది. ఇక అన్నపూర్ణమ్మ బాధ చూసిన నెటిజన్స్ అంతా కూడా ఆమెకు ఊరటగా కామెంట్స్ చేస్తున్నారు. "కంటే ఒక బిడ్డేనమ్మా పార్వతీదేవికి ప్రపంచం అంతా బిడ్డలేనమ్మా అన్నపూర్ణమ్మా..అన్నపూర్ణమ్మ గారు బాధపడకండి అమ్మ మీ కోసం మేమంతా ఉన్నాం.." అంటూ ఆమెకు సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |